విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
కల్వకుర్తి: జనవరి 9(భారత్ కి బాత్)
ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని రంగాల్లో ముందు ఉండేలా కృషి చేయాలని కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు అమనగల్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో పీఆర్టియు క్యాలెండర్ ను పీ.ఆర్.టి.యు సంఘం అమనగల్లు మండల అధ్యక్షుడు సుదర్శన్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధ్యాయులు ముందుకు సాగుతూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టియు సంఘం ప్రధాన కార్యదర్శి చందర్, గౌరవ అధ్యక్షుడు మహమూద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పాండు, కార్యదర్శి పద్మజ రాణి, సీనియర్ సభ్యులు ప్రకాష్ గౌడ్, మమత, విజయమ్మ, షాహావర్, శ్వేతా తదితరులు పాల్గొన్నారు.