ఎమ్మెల్యే కసిరెడ్డిని సన్మానించిన అమనగల్లు వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి
కల్వకుర్తి: జనవరి 9(భారత్ కి బాత్)
కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మంగళవారం నాడు అమనగల్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించి, మొదటిసారిగా మండల పరిషత్ కార్యాలయనికి విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిని అమనగల్లు వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.