నూతన మండలానికి మల్లయ్య చేసిన సేవలు అభినందనీయం: మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్
పదవీ విరమణ కార్యక్రమంలో మల్లయ్యకు ఘన సత్కారం
రంగారెడ్డి: అక్టోబర్ 29(భారత్ కి బాత్)
కడ్తాల్ మండలంలో ఎంపీడీవో ఆఫీస్ లో అటెండర్ గా పనిచేసి, మంగళవారం నాడు పదవీ విరమణ పొందిన కోశిక మల్లయ్య దంపతులకు కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఏర్పడిన కడ్తాల్ మండలానికి మల్లయ్య చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. అలాగే కడ్తాల్ పై ప్రేమ ఉంటే రానున్న రోజుల్లో కూడా తను ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తిగా కూడా సేవలు అందించాలని కోరారు. మల్లయ్య పలకరింపు ప్రేమ, అనురాగాలను పంచేవని, అతని పలకరింపు కుటుంబసభ్యుడిలా అందరితో కలిసి పోయేవారని అన్నారు. మల్లయ్య ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో భగవంతుడు ఆయనను నిండు నూరేళ్ల ఆయుష్షును ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుజాత, ఎంపీఓ విజయ్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు బాబా, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.