పూలను, ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ- ఐవిఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న
హైదరాబాద్: అక్టోబర్ 10(భారత్ కి బాత్)
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ఐవిఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భగా నాగోల్ లోని తన నివాసంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ అని, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని ఆమె అన్నారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె మహిళా మణులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.