బ్యాక్ టు సెరెనిటీ కోర్టుయార్డ్ స్టేకేషన్ రీసార్ట్స్ ప్రారంభోత్సవ పూజా మహోత్సవం
రంగారెడ్డి: అక్టోబర్ 7(భారత్ కి బాత్)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని జనహర్ష నుండి లింగంపల్లి వెళ్లే దారిలో టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్, హయత్ నగర్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొడ్డు శ్రీవాణి బిక్షపతి గౌడ్ నేతృత్వంలోని బ్యాక్ టు సెరెనిటీ కోర్టుయార్డ్ స్టేకేషన్ రీసార్ట్స్ ప్రారంభోత్సవ పూజ ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్ బి నగర్ ఇంచార్జ్ మధుయాష్కీ గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనయుడు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, టిపిసిసి లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరిత ధన్ రాజ్ గౌడ్, కౌన్సిలర్ లు కోషిక ఐలయ్య, కళ్యాణ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కే. గురునాద్ రెడ్డి, రాయపోల్ మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్, మూర్తి, వాజిద్, వంశీధర్ రెడ్డి, సతీష్ గౌడ్, శేఖర్, టోనీ, సల్మాన్, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.