Search for:
  • Home/
  • क्षेत्र/
  • ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

 

హైదరాబాద్: డిసెంబర్ 26(భారత్ కి బాత్)

దిల్ సుఖ్ నగర్ లో మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో మంగళవారం నాడు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ ఘనంగా జరిగింది. వందలాది అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలి పారిపోవాలని అయ్యప్ప స్వామిని మొక్కడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్ గుప్తా, మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా, గురుస్వామి రమణ, జిన్నం వేణు బాలరాజు గుప్తా, వేణు గుప్త, కిషన్ గుప్తా, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.

ఎగ్ మల్లేశం గార్డెన్ జైపూర్ కాలనీలో శ్రీ పల్లె మహేష్ గౌడ్ మరియు ఎగ్గ బిక్షపతి గురుస్వాముల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా జరిగింది ఈ పడిపూజ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required