తోటిరెడ్డి రామచంద్రారెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
రంగారెడ్డి: ఆగష్టు 31(భారత్ కి బాత్)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటిరెడ్డి రామచంద్రారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం పెద్ద అంబర్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులకు చక్కని విద్యను అందించడంలో తోటిరెడ్డి రామచంద్రారెడ్డి అందించిన సేవలను కొనియాడారు. గెజిటెడ్ హెడ్మాస్టర్ గా పాఠశాలకు సేవ చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఓపెన్ స్కూల్ ప్రత్యేక అధికారిగా ఎస్ సి ఈ ఆర్ టి లో, సర్వ శిక్షా అభియాన్ లో, రంగారెడ్డి జిల్లా డిసిఈబి అధికారిగా ప్రత్యేక సేవలు అందించి సిన్సియర్ అధికారిగా పేరు ప్రఖ్యాతులు పొందారని ఆయన సేవలను గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలకు గాను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా పొందారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, స్థానిక నేతలు, విద్యార్థులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.