కుర్మల్ గూడలోని పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగకు హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
రంగారెడ్డి: ఆగష్టు 4(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో గల కుర్మల్ గూడలోని పోచమ్మ దేవాలయంలో ఆదివారం నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, పరస్పర సహకారంతో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మాజీ ఎమ్మల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కె. విజయ్ భాస్కర్ రెడ్డి, బి. రోహిణి రమేష్ కార్పొరేటర్, బి. గణేష్, మల్లారెడ్డి, అశోక్ గౌడ్, జంగయ్య, సత్తి రెడ్డి, పి. మల్లేష్ కొండల్ రెడ్డి, నరహరి చారి, ఆలయ పూజారి నర్సింహా రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.