Search for:
  • Home/
  • क्षेत्र/
  • అటవీ అధికారి ఫేక్ కరెన్సీ నోట్ల మార్పిడి గుట్టు రట్టు

అటవీ అధికారి ఫేక్ కరెన్సీ నోట్ల మార్పిడి గుట్టు రట్టు

రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్)


అటవీ అధికారి ఫేక్ కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారం రాచకొండ ఎల్ బి నగర్ ఎస్ఓటి పోలీసులకు దొరికిపోయాడు. శుక్రవారం నేరేడ్మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖలో ఉట్నూర్ రేంజ్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసాడు. 2014 లో సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా అవతారం ఎత్తాడు. నిజామాబాద్ లో సల్మాన్ ద్వారా ఫేక్ కరెన్సీ దందా గురించి తెలుసుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద టాక్సీ డ్రైవర్ లు జంపాణి అండర్సన్, కిషన్ లు పరిచయం అయ్యారు. వారితో వేగంగా, తొందరగా డబ్బు సంపాదించడానికి డూప్లికేట్ కరెన్సీ మార్పిడి గురించి బేగంబజార్ నుంచి మనోరంజన్ బ్యాంకు (చిన్న పిల్లల అవగాహన నోట్లు) నోట్లు తీసుకుని వాటితో ఒరిజినల్ నోట్లకు మూడింతలు ఎక్కువగా ఫేక్ కరెన్సీ (రూ.500 నోట్లు) ఇస్తామని చలామణి చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్ ఎల్ బి నగర్ సితార హోటల్ వద్ద ఫేక్ కరెన్సీ మార్చడానికి ప్రయత్నిస్తుండగా రాచకొండ ఎల్ బి నగర్ ఎస్ఓటి పోలీసులు సమాచారం అందుకుని 60 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లు, పోలీసు లాఠీ, 6 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

Leave A Comment

All fields marked with an asterisk (*) are required