కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిట్టు శ్రీశైలం
రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాచకొండ మైలారం(దండు మైలారం) వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీ గంగిడి మనోహర్ రెడ్డితో కలిసి వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరిగింది. ప్రచార రథంలో ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించారు. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిట్టు శ్రీశైలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మారుమూల గ్రామాల్లోని ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చేయడమే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క లక్ష్యమని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండుమైలారం గ్రామ సర్పంచ్ శ్రీమతి రమణ మౌని మల్లేశ్వరి, దండుమైలారం ఎంపీటీసీ 1 శ్రీమతి ఈదులకంటి అరుణ గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అశోక్ గౌడ్, నిట్టు శ్రీశైలం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కన్వీనర్ యాదగిరి రెడ్డి, ఇబ్రహీంపట్నం బిజెపి మండల అధ్యక్షులు దండే శ్రీశైలం యాదవ్, గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అనిల్ రెడ్డి, డిహెచ్ఓ ధీరజ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి వరప్రసాద్, గ్రామంలోని మహిళలు రైతులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.