ఘనంగా మాడురి శ్రీనివాస్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవం
రంగారెడ్డి: జులై 22(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని న్యూ మారుతి నగర్ కమిటీ హాల్ లో ఆర్య వైశ్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆర్య వైశ్య బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మొగుల్లపల్లి ఉపేందర్ గుప్తా, నాచం ప్రభాకర్ గుప్తా, మంచుకొండ సురేందర్ గుప్తా, చీకటి మల్ల అశోక్ కుమార్ గుప్తా, ఇమ్మడి రమేష్ గుప్తా, చక్రపాణి, కార్పొరేటర్లు రంగా నర్సింహా గుప్తా, పవన్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా మాడురి శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా అత్తెమ్ సత్తయ్య గుప్తా, కోశాధికారిగా ప్రభాకర్ గుప్తా, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాడురి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ సంఘం నూతన అధ్యక్షుడిగా తనపై బాధ్యతలు ఉంచిన సంఘం సభ్యులకు, సంఘం సలహాదారులకు కృతజ్ఞతలు తెలిపారు. తన శాయశక్తుల సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సంఘం సభ్యులు, దాతల సహకారంతో సేవ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఆర్యవైశ్య ప్రముఖులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, ఘనంగా సన్మానించారు.