Search for:
  • Home/
  • क्षेत्र/
  • బొంగులూరు ఎక్స్ రోడ్ లో నూతనంగా ప్రారంభమైన ఐడియల్ స్మార్ట్ కిడ్స్ ఎ ప్లే స్కూల్

బొంగులూరు ఎక్స్ రోడ్ లో నూతనంగా ప్రారంభమైన ఐడియల్ స్మార్ట్ కిడ్స్ ఎ ప్లే స్కూల్

రంగారెడ్డి: జూన్ 22(భారత్ కి బాత్)

 

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బొంగులూరు ఎక్స్ రోడ్ లో ఐడియల్ స్మార్ట్ కిడ్స్ ఎ ప్లే స్కూల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐడియల్ గ్రామర్ స్కూల్ హెడ్మాస్టర్ పి. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఐడియల్ స్మార్ట్ కిడ్స్ ఎ ప్లే స్కూల్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నామని, తమ పాఠశాలలో ఆడియో విజువల్ క్లాసెస్, ఆటపాటలతో కూడిన విద్యను నేర్చుకునే విధానం, అనుభవం, నైపుణ్యంతో కూడిన క్లాస్ టీచర్లు, డిజిటల్ క్లాస్ రూములు, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్, అందుబాటులో ఉండే విధంగా ఫీజ్ వంటి అంశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు. మరిన్ని వివరాలతో స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్స్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required