Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఆర్థికంగా ఆసరా కోసం మేర కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ

ఆర్థికంగా ఆసరా కోసం మేర కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ

రంగారెడ్డి: ఏప్రిల్ 18(భారత్ కి బాత్)

 

ఆర్థికంగా వెనుకబడిన మేర కులస్తులకు కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీల ద్వారా చేతివృత్తి టెండర్లను అప్పగించాలని మేరు సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పెండ్యాల చంద్రమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ సహారా కాంప్లెక్స్ లో మేర కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై చైర్మెన్ కీర్తి జయంత్ కుమార్, కో -చెర్మన్ దీకొండ ప్రకాష్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేరు సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పెండ్యాల చంద్రమోహన్ మాట్లాడుతూ మేరు కులంలో చాలా మంది జీవనోపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. మేర సొసైటీ చైర్మన్ కీర్తి జయంత్ కుమార్ మాట్లాడుతూ మేరు కులస్తులు ఎంతోమంది జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఆర్థికంగా చితికిపోయారని, వాళ్లు కూడా ఆర్థికంగా నిలబడాలని మేర సొసైటీని మేనేజింగ్ డైరెక్టర్ దీకొండ ప్రకాష్ తో కలిసి స్థాపించామని తెలిపారు. ఓ మంచి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాము కాబట్టి మమ్మల్ని ఆదరించాలని, ఒకరికొకరు తోడుగా నిలబడి సమస్యలను ఎదుర్కొంటూ, మనస్పర్ధలు లేకుండా, అందరం కలిసి సుఖ సంతోషాలతో జీవిద్దామని, కో-ఆపరేటివ్ బ్యాంక్ గా అవతరించే దిశగా అడుగులేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘ ముఖ్య నాయకులు గుంటి నరేందర్, కర్నే మల్లేష్, వాడపల్లి మాధవ్, సింగు విష్ణు, మాడిశెట్టి దీపక్, బోనగిరి శంకర్, మహిళా రాష్ట్ర సంఘం నాయకురాలు మాడిశెట్టి దివ్యలత, రాకల లక్ష్మీనారాయణ, మాడిశెట్టి జనార్ధన్, పోడిశెట్టి తిరుపతి, ప్రవీణ్, మేరు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మునగాల రాము, సంఘ వెంకటరాజ్యం మునగాల రమేష్, కొత్త నరసింహస్వామి నోముల శాంతి కుమార్ టింబర్వేణి ఆనంద్, సంఘ వీరప్ప, రాయి స్వామి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required