Search for:
  • Home/
  • क्षेत्र/
  • జీవితంలో ఎదగాలంటే నిరంతర సాధన అవసరం: షార్ట్ ఫిల్మ్ యువ దర్శకులు గంజి చంద్రశేఖర్

జీవితంలో ఎదగాలంటే నిరంతర సాధన అవసరం: షార్ట్ ఫిల్మ్ యువ దర్శకులు గంజి చంద్రశేఖర్

మేడ్చల్: మార్చి 21(భారత్ కి బాత్)

 

కీసర మండలం బోగారం గ్రామంలోని హోలీమారీ ఇంజనీరింగ్ కళాశాలలో వార్షికోత్సవం సందర్భంగా ఫెస్టివల్ లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా యాజమాన్యం వారు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, ఫోటోగ్రఫీ కాంటెస్ట్ లు నిర్వహించినారు. దానికి ముఖ్య అతిధిగా కడ్తాల్ మండలానికి చెందిన యువ దర్శకులు గంజి చంద్రశేఖర్ పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులు తీసినటువంటి షార్ట్ ఫిల్మ్స్, ఫోటోగ్రఫీలో (ఛాయా చిత్రాలు) ప్రదర్శించినారు. దానికి న్యాయ నిర్ణేతగా యువ దర్శకులు చంద్ర శేఖర్ పాల్గొని అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయడం జరిగినది. ఈ సందర్భంగా దర్శకులు చంద్రశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఎదగాలి అంటే చదువు తప్పనిసరని, బాగా చదివి సర్టిఫికెట్ సంపాదించి సినిమా రంగంలో అడుగుపెట్టాలని, చదువుకున్న యువత సినిమా రంగంలో రాణిస్తే చాలా మందిని మంచి మార్గంలో నడిచేలా చేయొచ్చని అన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, తన వ్యయ ప్రయాసాల గురించి వివరించారు. జీవితంలో ఎదగాలని ఆకాంక్ష ఉంటే సరిపోదని, దానికోసం నిరంతరం కష్టపడాలని సూచించారు. కష్టాన్ని కూడా ఇష్టపడితేనే విజయం వరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హోలీమారీ కళాశాల చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, షార్ట్ ఫిల్మ్ కోఆర్డినేటర్ డా. ఈ. కృష్ణ హరి, ఫోటోగ్రఫీ కోఆర్డినేటర్ డా. జగదీష్ నాయక్, ఎలిసియం ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ డా. బి.వి. రమణ, సిఎస్ఈ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ భాగ్య రాజ్ యాదవ్, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required