వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో చేరిన పూజారి శ్రీను
రంగారెడ్డి: మార్చ్ 3(భారత్ కి బాత్)
వర్కర్స్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి సిపిఐ పార్టీ నాయకులు కామ్రేడ్ పూజారి శ్రీను ఆదివారం నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయం కొత్తపేటలో వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో వర్కర్స్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాయబండి పాండురంగా చారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పూజారి శ్రీను ప్రసంగిస్తూ గతంలో అఖిల భారత యువజన సమాఖ్య ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శిగా, సిపిఐ రంగారెడ్డి జిల్లా పార్టీలో సమితి సభ్యులుగా, ఇండ్ల కోసం భూ పోరాటాలు, బలమైన ఉద్యమాలు చేశానని, సిపిఐ పార్టీలో గత 30 సంవత్సరాలుగా పని చేసిన, తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కర్స్ పార్టీ కార్మిక, కర్షక రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తుందని, పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరి పైన ఉందని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ పోటీ చేస్తుందని పాండురంగ చారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కొప్పు యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రాములు, కమిటీ సభ్యులు దెందే అయోధ్య పాల్గొన్నారు.