Search for:
  • Home/
  • क्षेत्र/
  • పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి: గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి: గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

రంగారెడ్డి: మార్చ్ 3(భారత్ కి బాత్)

 

ఆదివారం నాడు పోలియో దినోత్సవం సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్ సిండికేట్ బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. డివిజన్లోని ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నది లక్ష్యమని అన్నారు. గడ్డిఅన్నారం పరిసర ప్రాంతాలలోని చిన్నారులు సమీపంలోని పోలీసు పోలియో చుక్కల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్, ఓ.బి.సి మోర్చా రాష్ట్ర నాయకులు మురళి, బీజేపీ కార్యకర్తలు టీంకు, వంశీ, ఆషా, అంగన్ వాడీ కార్మికులు వివిధ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required