విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉంటాం: విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షులు సునీల్
హైదరాబాద్: జనవరి 29(భారత్ కి బాత్)
ఆచార్యరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున యూనివర్సిటీకి చెందిన స్థలాన్ని హైకోర్టుకు కేటాయించొద్దని నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా విద్యార్థి లోకం కదలాలని కోరుకుంటూ, విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉంటామని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యొచ్చు సునీల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో 55 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 55 రద్దు చేయకుంటే మా నిరసనలు ఇంకా ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే పార్టీ నాయకులు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి, అనికేత్ కోషిగా, నవీన్ బాబు, సాత్వికా రెడ్డి, అనిల్, గోపాల్, మనోజ్, విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్ధి నాయకులు పాల్గొన్నడం జరిగింది.