హయత్ నగర్ లో బిజెపి రాష్ట్ర శాఖ నిర్వహించిన మహిళా శక్తి వందన్
రంగారెడ్డి: జనవరి 29(భారత్ కి బాత్)
హయత్ నగర్ లోని ఎస్ వి కన్వెన్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించిన శక్తి వందన్ మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎన్జీవోల సంపర్క్ అధియాన్ కార్యశాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్యులు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో కలసి పాల్గొన్న స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శిల్ప రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.