హస్తినాపురంలో ఘనంగా దశమి గ్రాండ్ మల్టీ కుసైన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం
రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్)
ఎల్ బి నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ జడ్పి రోడ్ లోని వెంకటేశ్వర కాలనీలో ప్రోపరైటర్ మర్రి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో దశమి గ్రాండ్ మల్టీ కుసైన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలు వీరిని ఆదరించి ముందుకు నడిపించాల్సిందిగా కోరారు. మీరు ఇలా దినదిన అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ప్రొపెరైటర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద అనుభవజ్ఞులైన చెఫ్స్ తో సరికొత్త రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయని తెలిపారు. చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని, ఫిష్ బిర్యాని, ప్రాన్స్ బిర్యాని, టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తాయని అన్నారు. ఈ పరిసర ప్రాంతంలో ఇలాంటి రుచులు మరి ఎక్కడ లభించవని తెలిపారు. ఉదయం టిఫిన్స్ నుంచి మొదలు పెడితే రాత్రి డిన్నర్ వరకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయని అన్నారు. స్విగ్గి, జోమటోలో కూడా మా సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. కావున పరిసర ప్రాంత ప్రజలు సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.