గుబులు పడకే అవ్వ రూ.4 వేల పెన్షన్ ఇస్తాం: కెఎన్ఆర్ యువసేన నాయకులు విజయ్ రాథోడ్
రంగారెడ్డి: మే 3(భారత్ కి బాత్)
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నేరవేరుస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లు మండలంలోని మంగళపల్లి గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు గ్రామ నాయకులతో కలసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ అవ్వను ఆప్యాయంగా పలకరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. అదే విధంగా అవ్వతో ముచ్చటిస్తు గుబులు పడకు త్వరలో 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ్ రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయనను ప్రధానిని చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్ని కల్లో హస్తం గుర్తుకు ఓటేసి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.