Search for:
  • Home/
  • क्षेत्र/
  • అందరి జీవితాలలో చీకట్లు తొలగి ఆనందాల హరివిల్లు వీయాలి: నిట్టు శ్రీశైలం

అందరి జీవితాలలో చీకట్లు తొలగి ఆనందాల హరివిల్లు వీయాలి: నిట్టు శ్రీశైలం

గ్రామ పంతులు బహుగుణ రాఘవేందర్ శర్మ ఆధ్వర్యంలో శ్రవణ పంచాంగం

 

రంగారెడ్డి: ఏప్రిల్ 9(భారత్ కి బాత్)

 

క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశ్రీశ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బీరప్ప స్వామి కామరతి దేవాలయాన్ని దర్శించుకొని, బీరప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరి కోరికలు తీరాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, చీకట్లు తొలగి ఆనందాల ఉషోదయం కావాలని, ప్రార్ధించిన బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం.

 

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాచకొండ మైలారం స్వగ్రామం దండుమైలారంలోని శ్రీశ్రీశ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బీరప్ప స్వామి కామరతి దేవాలయం వద్ద క్రోధి నామ సంవత్సర ఉగాది పుష్కరాలలో భాగంగా బీరప్ప స్వామి కామరతికి పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెద్దకుర్మ, మాజీ సర్పంచ్, నిట్టు నర్సింహ, సెల్విఓజి మంగ శ్రీశైలం, పెద్దగొల్ల ముద్దం యాదయ్య యాదవ్, కురుమ సంగం అధ్యక్షులు నిట్టు మల్లేష్, ఉపాధ్యక్షులు బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో పంచాంగ పఠన(శ్రవణ) కార్యక్రమం గ్రామ పంతులు బహుగుణ రాఘవేందర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు మంగ వెంకటేష్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మంగ ఐలేష్ కురుమ, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు నిట్టు గాలయ్య, గ్రామ పంచాయతీ మాజీ సభ్యులు నిట్టు బీరప్ప, చిట్టె శ్రీశైలం, నిట్టు శ్రీశైలం(పెద్ద), బీర్ల శివయ్య, మల్లా శ్రీను, నిట్టు మినయ్య, రావుల జంగయ్య, పట్నం శ్రీశైలం, మంగ శ్రీను, సుబ్బురు బాలయ్య, సుబ్బురు వెంకటేష్, బీర్ల బాలప్ప, కురుమ గొల్ల పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required