హిందూధర్మమే దేశానికి శ్రీరామరక్ష
శ్రీ హరిహర క్షేత్రం 13వ వార్షికోత్సవంలో పాల్గొన్న అందెల
జగద్గురువు శ్రీ విద్యారణ్య భారతి ఆశీస్సులు తీసుకున్న శ్రీరాములు
రంగారెడ్డి: మార్చి 22(భారత్ కి బాత్)
బైరామల్ గూడ శ్రీ అయ్యప్ప స్వామి గుడి 13వ వార్షికోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్. ధ్వజస్తంభo, శ్రీరామలక్ష్మీ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన దైవకార్యంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్పొరేటర్, ఆలయ వ్యవస్థాపకులు వంగా మధుసూదన్ రెడ్డి ఆహ్వానం మేరకు అందెల శ్రీరాములు, అశోక్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ హిందూధర్మం వల్లే దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ బంధువుల కల సాకారం అయిందన్నారు. తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లతున్న శ్రీ హరిహర క్షేత్రం వార్షికోత్సవంలో పాల్గొన్నటం నా అదృష్టమని అన్నారు.