Search for:
  • Home/
  • क्षेत्र/
  • ముచ్చటగా మూడోసారి మళ్లీ ప్రధాని మోడీనే: అందెల శ్రీరాములు యాదవ్

ముచ్చటగా మూడోసారి మళ్లీ ప్రధాని మోడీనే: అందెల శ్రీరాములు యాదవ్

మహేశ్వరం నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

 

రంగారెడ్డి: మార్చి 20(భారత్ కి బాత్)

 

బుధవారం నాడు మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మేటి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీకేఆర్, టికేఆర్ కన్వెన్షన్ హాల్ బడంగ్పేట్ లో మహేశ్వరం అసెంబ్లీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి, బిజెపి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలందరూ బిజెపిని స్వాగతిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూడా మూడవసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అలాగే చేవెళ్ల పార్లమెంట్లో కూడా ప్రజలు భారీ మెజారిటీతో బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రమించి కష్టపడ్డారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నైతికంగా విజయం మనదే అని, మీరు ఎక్కడ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటానని, మన ప్రత్యర్థి దొంగ ఓట్లుతో గెలిచిందని వారికి కూడా తెలుసని, ఈ దొంగ ఓట్లను వెంటనే గుర్తించి తొలగించాలని అధికారులకు సూచించామని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంతకు పైఎత్తుగా దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం వేసే ఓటు కాబట్టి ప్రతి బూత్ స్థాయి కార్యకర్త నాతో పాటు కంకణం కట్టుకొని కష్టపడి పని చేసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పాపయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ కో కన్వీనర్ అనంతయ్య గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగయ్య యాదవ్, కొలను శంకర్ రెడ్డి, మహేశ్వరం మండల ఎంపీపీ కొండే వెంకటేష్, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ కాటేకర్ మధుమోహన్, మహేశ్వరం నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required