మొక్కలు నాటి సంరక్షించాలి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: జనవరి 30(భారత్ కి బాత్)
మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు వద్ద విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సమీపంలోని నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. చెరువు కట్టతో పాటు ఐ లాండ్ తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. గ్రీన్ బడ్జెట్ లో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే చెట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెంట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు లావణ్య, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.