బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసిన న్యూస్ అఖండ వ్యవస్థాపకులు కస్తూరి శ్రీధర్
ఆంధ్రప్రదేశ్: జనవరి 30(భారత్ కి బాత్)
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరిని మంగళవారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో న్యూస్ అఖండ వ్యవస్థాపకులు కస్తూరి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జాతీయవాద ఛానల్ న్యూస్ అఖండ నిర్వహణ, అలాగే భవిష్యత్ రాజకీయ కార్యాచరణ, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న అంశంపై చర్చించడం జరిగిందని శ్రీధర్ తెలిపారు. వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకున్న దగ్గుబాటి పురంధేశ్వరి సానుకూలంగా స్పందించారని తెలియజేశారన్నారు.