ప్రజల కోసం నూతన మున్సిపల్ కార్యాలయం: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: జనవరి 22(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మునిసిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆదివారం నాడు సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. రెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న నూతన కార్పొరేషన్ భవన నిర్మాణ పనులను ఆదివారం తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం సకల సౌకర్యాలు కల్పించి, అందుబాటులో ఉండాలని కార్యాలయ నూతన భవనానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తేవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు లావణ్య, కార్పొరేటర్లు, అధికారులు, జల్పల్లి సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అజ్జు ఉన్నారు.