సాలార్ పూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన దశరథ్ నాయక్
రంగారెడ్డి: జనవరి 10(భారత్ కి బాత్)
కడ్తాల్ మండలంలోని సాలార్ పూర్ గ్రామపంచాయతీలో (SPL) సాలార్పూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ని శుక్రవారం నాడు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా గ్రామీణ యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టోర్నమెంట్ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకొని, టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ప్రియా, రమేష్, పంతు నాయక్, సాయిలు, నాయకులు బాబా, జంగయ్య కుమార్, నరేష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.