రాచకొండ ప్రెస్ క్లబ్ లోగోను ఆవిష్కరించిన రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు
రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్)
రాచకొండ పరిధిలోని జర్నలిస్టుల అభివృద్ధికి దోహదపడాలని, రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు రాచకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పొట్లపల్లి అశోక్ గౌడ్ కు సూచించారు. తన కార్యాలయంలో రాచకొండ ప్రెస్ క్లబ్ లోగోను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాచకొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాచకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ రాచకొండ పరిధిలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతామని, ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇంటి స్థలాల సాధనలో రాచకొండ ప్రెస్ క్లబ్ ముందంజలో ఉంటుందని, ప్రతి జర్నలిస్టు తమ సమస్యలను రాచకొండ ప్రెస్ క్లబ్ కు తెలపాలని కోరారు. అనంతరం కమిషనర్ ఆఫ్ పోలీస్ కు అశోక్ గౌడ్ రాచకొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని పరిచయం చేశారు. ఉపాధ్యక్షుడిగా సానెం శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పిట్ట విష్ణువర్ధన్ రెడ్డి, కోశాధికారిగా నంబి పర్వతాలును ఎన్నుకున్నామని తెలిపారు.