చీరల పంపిణీ చేసిన జయ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కమల దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్)
జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి కమల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో హయత్ నగర్ డివిజన్ పరిధిలోని ఎలిమ్ ప్రేయర్ హౌస్ నందు జరిగిన ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో భాగంగా కేక్ కటింగ్, చీరల పంపిణీ మరియు కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, క్రిస్మస్ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఆ యేసు క్రీస్తు కృప ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఎల్లపుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, గౌరవ అతిథుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు, చిన్నారులకు, ప్రజలందరికీ ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ గౌడ్, చంద్రశేఖర్ అజాద్, రవి, ఎలియ, శివ, చర్చిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, దైవ సేవకులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.