బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన జహంగీర్ జీ
రంగారెడ్డి: జనవరి 10(భారత్ కి బాత్)
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను ఈ సర్పంచ్ ఎన్నికలలో అమలు చేయాలని కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జహంగీర్ జీ అన్నారు. ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయకుంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు.