గో రక్ష మహా పాదయాత్రలో పాల్గొన్న స్వాములకు స్వాగతం పలికిన కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: డిసెంబర్ 23(భారత్ కి బాత్)
అఖిల భారత గో సేవా సమితి బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో దేశవ్యాప్త కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మహా పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ కొత్తపేట్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికిన గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. కాశ్మీర్‌లో ప్రారంభమైన పాదయాత్ర కన్యాకుమారిలో ముగుస్తుందని, గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ కోసం లక్ష్యంగా బాలకృష్ణ గురుస్వామి మహా పాదయాత్ర. ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ గురుస్వామి మరియు అఖిల భారత గో సేవా సమితి ఈ కీలకమైన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు ఆరుట్ల సురేష్, బెంగారబోయిన సురేష్, వేణు, సైలేష్ మరియు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.