నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
రంగారెడ్డి: నవంబర్ 5(భారత్ కి బాత్)
గడ్డిఅన్నారం డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్, శ్రీనగర్ కాలనీ వద్ద తరచూ డ్రైనేజీ సమస్యతో కాలనీవాసులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఉదయం జలమండలి సిబ్బందితో కలిసి కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కాలనీలోని డ్రైనేజీ సమస్యను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పొంగి రోడ్డుపై పారుతోందని, దీంతో కాలనీవాసులము, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, వెంటనే నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కార్పొరేటర్ ని కోరారు. తక్షణమే స్పందించిన కార్పొరేటర్ నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ రజిత, సిబ్బంది ప్రశాంత్, నర్సింగ్, నరేష్, బీజేపీ కార్యకర్తలు సాయి, టింకు, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.