Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఆర్యవైశ్యుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం

ఆర్యవైశ్యుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం

అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్: అక్టోబర్ 16(భారత్ కి బాత్)

ఆర్యవైశ్యుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైటెక్ సిటీ హోటల్ ఐ స్టేలో బుధవారం నాడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులను ఏకం చేయడమే అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. తెలంగాణలో ఐవిఎఫ్ బలోపేతానికి కృషి చేస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తని ఆయన అభినందించారు. అనంతరం గంజి రాజమౌళి గుప్త మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.

అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వ్యాపార రంగంలో రాణించాలని అందుకు అన్నివిధాలా సహకరిస్తానని తెలిపారు.

ఎన్నో యేండ్ల కల ఆర్యవైశ్య కార్పొరేషన్ ను సాకారం చేసినందుకుగాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, సీఎం నాయకత్వంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం అన్నివిధాల మరింత సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆర్యవైశ్యులకు మరిన్ని పదవులు దక్కేల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ రాష్ట్ర నాయకులు ముత్యాల సత్తయ్య, సంతోష్ గుప్త , బిజ్జల నవీన్ గుప్త, గట్టు మహేష్ గుప్త, సంబు పాండు గుప్త, కటకం శ్రీనివాస్ గుప్త, చింతల రజినీకాంత్ గుప్త, కొడిపాక నారాయణ, నరేష్ గుప్త, బెళ్దే రవి కుమార్ గుప్త, గట్టు మహేష్ గుప్త, ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required