మలక్ పేట్ లో నూతనంగా ప్రారంభమైన మాషల్ బ్యాంక్యూట్స్
హైదరాబాద్: సెప్టెంబర్ 30(భారత్ కి బాత్)
మలక్ పేట్ సలీం నగర్ కాలనీలో మహమ్మద్ అబ్దుల్ కరీమ్ వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన సుందరమైన భవనం మాషల్ బ్యాంక్యూట్స్ ను ఆదివారం సాయంత్రం మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. అనేక శుభకార్యాలకి, సమావేశాలకి అందమైన మోడల్ లో సకల సదుపాయాలతో వినియోగదారులకు ఈ వేదికను (బ్యాంక్యూట్స్ ) ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ వ్యాపార వృత్తిలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ వారి మన్ననలు పొంది మరిన్ని బ్రాంచీలను నెలకొల్పేలా ఎదగాలని ఆయన యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మహమ్మద్ అబ్దుల్ కరీమ్ మాట్లాడుతూ ప్రజలకు సకల శుభకార్యాలకు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ సుందరమైన వేదికను ఆశ్రయించి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పాత బస్తీకి చెందిన యాకత్ పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సాహెబ్, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ సాహెబ్, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ ఫేకర్ అలీ సాహెబ్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ సాహెబ్, ప్రోప్రైటర్ ఆర్కేరే డెంటల్ మొహమ్మద్ ఫరూక్ షా, మెడికల్ డైరెక్టర్ ఆర్ కె ఆర్ డెంటల్ డాక్టర్ అబ్దుల్ రహీం, ఏ అండ్ ఏ అసోసియేట్స్ సయ్యద్ మొహమ్మద్ అసిన్, ఎండో డొనేస్ట్ ఆర్కేఆర్ డెంటల్ డా. అబ్దుల్ రెహమాన్, యాజమాన్యానికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.