ప్రేరణ హిందీ ప్రచారిణి సభ భారత్ వారి హిందీ అభియాన్ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం లో విజయవంతంగా జరిగింది..
హిందీ ని రాష్ట్ర భాష చేయాలని సంకల్పం తో ముందుకు పోతున్న సంస్థ ప్రేరణ హిందీ ప్రచారిణి సభ. ఈ సంస్థ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధి లోని శ్రీ సాయి చైతన్య హైస్కూల్ లో హిందీ ప్రచార కార్యక్రమము ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హిందీ వ్యాకరణ పాఠాలు విద్యార్థులకు బోధించారు.
ప్రేరణ హిందీ ప్రచారిణి సభ భారత్ సలహకారుడు డా. గుండాల విజయ కుమార్ హిందీ బాష ను తప్పని సరిగా నేర్చుకోవాలి మరియు హిందీ ని ప్రచారం చేయాలి అని తెలిపారు. కార్యక్రమం లో భాగంగా విద్యరాణి, రోజ, సంగీత, శ్రీదేవి,సురేష్, శ్రీకాంత్ రెడ్డి హిందీ వ్యాకరణ పాఠాలను విద్యార్థులకు బోధించారు. ప్రతిభను చూపించిన కొంత మంది విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ నరసింహా రెడ్డి గారు మరియు పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమము కు సహకరించినదుకు డా. గుండాల విజయ కుమార్ వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.