Search for:

ఆర్య వైశ్యులకు వెన్నంటే ఉంటా

టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త 

ఆర్య వైశ్య భవన నిర్మాణానికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేత

హైదరాబాద్: ఆగష్టు 18(భారత్ కి బాత్)

ఆర్య వైశ్యులకు అండగా ఉంటానని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. పురానాపూల్ ఆర్య వైశ్య భవనం నిర్మాణానికి తన వంతుగా చారిటబుల్ ట్రస్ట్ కి లక్ష రూపాయలు విరాళం అందించారు.

ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన తెలిపారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సదానంద గుప్త, యాడ శ్రీనివాస్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required