శ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి
రంగారెడ్డి: ఆగష్టు 12(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లోని శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజ స్థంభం ప్రతిష్ట కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎరుకల విశ్వనాథ్ గౌడ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎరుకల విశ్వనాథ్ గౌడ్, అధికారులు, జయ ప్రసాద్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, జగదీష్ గౌడ్, శ్రీధర్ గౌడ్, సాయి కాయలకొండ, రాజు తదితరులు పాల్గొన్నారు.