భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన అంగన్వాడీలు
మైలవరం, డిసెంబర్ 20 : (భారత్ కీ బాత్) తొమ్మిది రోజులుగా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు, అందులో భాగంగా మైలవరం యంపిడిఓ కార్యాలయంలో సమ్మె కొనసాగించారు. అనంతరం , మైలవరం పురవీధుల్లో బిక్షాటన చేస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, జి.కొండూరు మండల కార్యదర్శి కే బాలకృష్ణ, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండిగా వ్యవహరించడం తగదని 40 సంవత్సరాలుగా పేద పిల్లలకు గర్భవతులకు సేవలు చేస్తూ అనారోగ్యాల పాలై ఆర్థికంగా కుదరైన అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే కక్ష సాధింపు దిగుతూ దుర్మార్గమైన రీతిలో వ్యవహరిస్తా ఉందని ఇది మంచి పరిణామం కాదని వారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. అంగన్వాడీల ఉద్యమాన్ని అడ్డుకునేందుకు సచివాలయ ఉద్యోగులను అంగన్వాడీ టీచర్లుగా వర్కర్లుగా మార్చడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అంగన్వాడీ వర్కు తో ఏ విధమైన సంబంధం లేని వివో ఏ లను వాలంటీర్లు తొ తాళాలు పగలగొట్టిచ్చి వారి ద్వారా సెంటర్లు నడిపించాలని అనుకోవడం దుర్మార్గమైన చర్యని వారు అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపుతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ ఆర్ వి పుష్పకుమారి ,సిహెచ్ శారదకుమారి, బుల్లెమ్మ, రబ్బాని, మాణిక్యం, లక్ష్మి, మేరీ కుమారి, సరోజినీ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.