ఆదిభట్లలో ఘనంగా ప్రారంభమైన శ్రీ స్కవ ది ఫుడ్ హబ్
రబగారెడ్డి: జూన్ 22(భారత్ కి బాత్)
భోజన ప్రియులకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలోని టిసిఎస్ సమీపంలో శ్రీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన శ్రీ స్కవ ది ఫుడ్ హబ్ రెస్టారెంట్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన అదితి మ్యాకల్ ప్రారంభించారు. అద్భుతమైన రుచితో పాటు పూర్తి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంలో శ్రీ స్కవ ది ఫుడ్ హబ్ రెస్టారెంట్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తమ రెస్టారెంట్లో అన్ని రకాల చికెన్, మటన్, ఫిష్ ఫ్రాన్స్ బిర్యానీలతో పాటు స్టాటర్స్, ఇండియన్, చైనీస్ పలు రకాల రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆదిభట్లలో సెకండ్ బ్రాంచ్ అని మొదటి బ్రాంచ్ వనస్థలిపురంలో ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.