హయత్ నగర్ లో బిఎం కాన్సెప్ట్ స్కూల్ నూతన ప్రారంభోత్సవం
హయత్ నగర్: జూన్ 19(భారత్ కి బాత్)
హయత్ నగర్ లోని మదర్ డైరీ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బిఎం కాన్సెప్ట్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ చైర్మన్ బ్రహ్మయ్య, వైస్ చైర్మన్ ఆంజనేయులుకి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలనీ వాసులకు అతిదగ్గరలో ఉండే విధంగా స్కూల్ ఏర్పాటు చేయడం అభినందించవలసిన విషయమని వారు తెలిపారు. పేద, మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని స్కూల్ ఫీజు పరిమితి ఉండే విధంగా చూడాలని, అంతేకాకుండా పిల్లలకు చిన్నప్పటినుంచే మన తెలుగు సాంస్కృతి, సాంప్రదాయాలను నేర్పించాలని వారు తెలపారు. స్కూల్ చైర్మన్ బ్రహ్మయ్య మాట్లాడుతూ తమ స్కూలులో వెల్ ఫర్నిషెడ్, విశాలమైన తరగతి గదులు, నైపుణ్యంతో కూడిన టీచర్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఫోర్త్ క్లాస్ నుండి ఐఐటి ఫౌండేషన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. దూర ప్రాంత విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజి కౌన్సిలర్ ఈశ్వరమ్మ యాదవ్, తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ జేఏసీ చైర్మన్ కటకం నర్సింగ్ రావు, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, బీజేపీ సీనియర్ నాయకులు పాండల శ్రీను, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, సీనియర్ నాయకులు ఎర్రవెలి సత్యనారాయణ, గంగాని శ్రీను, అరుణ్, బీజేవైఎం డివిజన్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.