Search for:
  • Home/
  • क्षेत्र/
  • బడంగ్ పేటలో నూతనంగా ప్రారంభమైన స్పోర్ట్స్ అరేనా(బాక్స్ క్రికెట్)

బడంగ్ పేటలో నూతనంగా ప్రారంభమైన స్పోర్ట్స్ అరేనా(బాక్స్ క్రికెట్)

రంగారెడ్డి: మే 20(భారత్ కి బాత్)

 

బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ సి ఐ రోడ్ లో సికెఆర్ మరియు టికెఆర్ ఫంక్షన్ హాల్ పక్కన నూతనంగా ప్రారంభమైన స్పోర్ట్స్ అరేనా (బాక్స్ క్రికెట్) ను నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానులు నర్సింగ్ గౌడ్, మోహన్ రెడ్డి, విజయ్ పాశం, చంద్రకాంత్, శ్రీకాంత్ లు మాట్లాడుతూ బాక్స్ క్రికెట్ ఇండోర్ స్టేడియం లాగా ఉంటదని, అలాగే పైన రూఫ్ కూడా ఉందని, వర్షాకాలం అయినా ఎండాకాలమైన సరే ఏ ఇబ్బంది లేకుండా ఆడుకోవచ్చని అన్నారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఫుడ్ కోర్ట్ కూడా ఉందని, మంచి నీటి సదుపాయం, వాష్ రూమ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చని, చుట్టుపక్కల నుండి ఏ ఇబ్బంది ఉండదని, ప్రశాంతమైన వాతావరణంలో తమ విలువైన సమయాన్ని మా వద్ద గడపొచ్చని తెలిపారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required