మల్లాపూర్ లో నూతనంగా ప్రారంభమైన కడక్ హౌస్ కేఫ్
రంగారెడ్డి: ఏప్రిల్ 15(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం మల్లాపూర్ గ్రామంలో రికవర్ హాస్పిటల్ ప్రక్కన సోమవారం నాడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ మున్సిపాలిటీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని కడక్ హౌస్ కేఫ్ ను ప్రారంభించారు. వీరితో పాటు ముఖ్య అతిధిగా కొత్త రఘు గౌడ్ కూడా పాల్గొన్నారు. కడక్ హౌస్ కేఫ్ యజమానులు కృష్ణకాంత్, రోహిత్ కుమార్, అక్కి రోహిత్ గౌడ్, అక్కి తరుణ్ గౌడ్ లు మాట్లాడుతూ మా వద్ద ఇరానీ చాయ్, జాఫరని చాయ్, మిల్క్ షేక్స్, ఆరోగ్యవంతకరమైన తినుబండారాలు అన్ని లభించును అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, స్నేహితులు, బంధువులు, అక్కి రాము గౌడ్, అక్కి వేణు గౌడ్, రాంలాల్, భిక్షపతి, సుమన్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.