అందరూ బాగుండాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్తా
హైదరాబాద్: మార్చి 22(భారత్ కి బాత్)
హైదరాబాద్ లోని జైపూర్ కాలనీ, నాగోల్ శ్రీ శిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు దేవాలయాన్ని (సాయి నాధుడి)ని దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వాదం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఐవిఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొలను వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొరివి జంగయ్య గుప్తా, కోశాధికారి రావుల రంజిత్ గౌడ్, వ్యవస్థాపక అధ్యక్షులు గుణగంటి రాములు గౌడ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.