దేశాభివృద్ధి కేవలం మోడీతోనే సాధ్యం: నాగర్ కర్నూల్ ఎంపీ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్
రంగారెడ్డి: మార్చి 17(భారత్ కి బాత్)
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని మోడీతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల అధ్యక్షులు సుధాకర్ రావు, నారాయణ, రామచంద్ర రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, జక్క రఘునందన్ రెడ్డి, దిలీప్ చారి తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ:
400 ఎంపీలతో నరేంద్ర మోడీని మరోసారి భారత ప్రధాని చేసే భాగస్వామ్యంలో నాగర్ కర్నూల్ ఎంపీగా నన్ను(పోతుగంటి భరత్ ప్రసాద్) ఆశీర్వదిస్తే నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను తీసుకువచ్చి నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని భరత్ ప్రసాద్ హామీనిచ్చారు. దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ వైపే ఉన్నారని, నరేంద్ర మోడీ హయాంలోనే భారత్ ప్రపంచ ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే బిజెపికి ఓటు వేసి బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
1 Comment
సూపర్ భరత్ ప్రసాద్ మై ఓట్ ఫర్ బీజేపీ