Search for:
  • Home/
  • क्षेत्र/
  • దేశంలో 400 కు పైగా లోక్ సభ స్థానాలే లక్ష్యం: నూకల నరసింహారెడ్డి

దేశంలో 400 కు పైగా లోక్ సభ స్థానాలే లక్ష్యం: నూకల నరసింహారెడ్డి

నల్గొండ: ఫిబ్రవరి 27(భారత్ కి బాత్)

 

దేశ వ్యాప్తంగా కోటిమందిని ప్రత్యక్షంగా కలిసి, ప్రభుత్వం సాధించిన విజయాలు తెలియజేసి దేశంలో 400 సీట్ల సాధనే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి అన్నారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ కృష్ణ విజయ సంకల్ప యాత్ర పేరుతో నిర్వహించే ఈ యాత్ర నల్లగొండ లోక్ సభ పరిధిలో ఫిబ్రవరి 27వ తేదీన నల్లగొండ డిండిలో ప్రవేశిస్తుందని అన్నారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మూడు రోజుల పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుగుతూ మార్చి1న నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో సభ నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రలో కేంద్ర, రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ యాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి కేంద్రంలో 3వ సారి బీజేపీ అధికారం చేపట్టడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధి విషయంలో చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి విజయ సంకల్ప యాత్ర ప్రముఖ్ పోతేపాక సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి చారి, జిల్లా కార్యదర్శులు పోతేపాక లింగస్వామి, మండల వెంకన్న, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండ భవాని ప్రసాద్, మీడియా ఇంచార్జ్ పెరిక ముని కుమార్, పిన్నింటి నరేందర్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required