రానున్నది మళ్ళీ మోదీ ప్రభుత్వమే: మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి
రంగారెడ్డి: ఫిబ్రవరి 24(భారత్ కి బాత్)
మరోసారి మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి. విజయ సంకల్ప యాత్రలో భాగంగా నాల్గవ రోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ తో పాటు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొని ప్రసంగించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో కృష్ణమ్మ క్లస్టర్ యాత్ర ప్రముఖ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ జడ్పీటీసీ కండే హరి ప్రసాద్, బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.