Search for:
  • Home/
  • क्षेत्र/
  • వికలాంగుల పెళ్లికి అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

వికలాంగుల పెళ్లికి అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేత

 

రంగారెడ్డి: ఫిబ్రవరి 24(భారత్ కి బాత్)

 

సంగారెడ్డికి చెందిన తండ్రి లేని, నిరు పేద వికలాంగురాలు ప్రవళిక వివాహం కోసం ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మరియు వారి సతీమణి ఉప్పల ఫౌండేషన్ కో చైర్ పర్సన్ ఉప్పల స్వప్నల చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో పెళ్లి కూతురు వారి కుటుంబ సభ్యులు, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్, అమ్మ ఫౌండేషన్ అధినేత నాగమళ్ల అనిల్ కుమార్ అరుణ, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మెరుగు శివ కృష్ణ, తుల్జమ్మ, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required