మరో డిఎంఎస్ సంస్థ కుచ్చుటోపి
పేద, మధ్యతరగతి ప్రజలే వీళ్ళ ఆయుధం
తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరిన బాధితులు
రంగారెడ్డి: ఫిబ్రవరి 5(భారత్ కి బాత్)
డిఎంఎస్ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించిన 3000 మంది బాధితులము మేము, 29/01/2024 నుండి మీర్పేట్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని, మదన్ గౌడ్ మరియు శివ గౌడ్ వాళ్లు దొరకడం లేదని, వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకోవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నామని బాధితులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో రెండోసారి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, మా అందరికీ న్యాయం చేయాలని మీర్పేట్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను కోరడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు.