జిల్లెలగూడెలో నూతనంగా ప్రారంభమైన ప్రియాస్ ఆక్వా ఫ్రెష్
రంగారెడ్డి: ఫిబ్రవరి 8(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీ జిల్లెలగూడలో శుక్రవారం నాడు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రియాస్ ఆక్వా ఫ్రెష్ ఆర్.కె. ఎంటర్ప్రైజెస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పి. రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల జీవన విధానానికి సరిపడేల మంచి నీరు ఉండేవిధంగా ప్రియాస్ ఆక్వా ఫ్రెష్ ను జిల్లెల్ల కూడా ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వారం రోజుల వరకు 40% డిస్కౌంట్ ఓపెనింగ్ ఆఫర్ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యామా మల్లేష్ యాదవ్, ఠాకూర్ బాలాజీ సింగ్, స్నేహితులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.