కాలనీవాసులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 3(భారత్ కి బాత్)
ఎల్ బి నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి బుధవారం నాడు డివిజన్ లోని హనుమాన్ నగర్ లో హెచ్ ఎం డబ్యూ ఎస్ & ఎస్ బి మేనేజర్ రాజుతో కలిసి కాలనీలో భూగర్భ డ్రైనేజీ లెవెల్స్ పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాలనీలోని లోతట్టు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని, లెవెల్ పరిశీలించాలని, రాబోవు కాలంలో కాలనీవాసులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని, డ్రైనేజీ పైపులు కూడా అందుబాటులో ఉండడంతో వెంటనే పనులు ప్రారంభించాలని మేనేజర్ కి తెలపడం జరిగిందన్నారు. ఈ పర్యవేక్షణలో కాలనీ అధ్యక్షులు విట్టల్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శేఖర్ రెడ్డి, సాయి, లింగ స్వామి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.